fbpx
Wednesday, December 4, 2024
HomeInternationalజనాభా పెంపు కోసం శృంగార మంత్రిత్వశాఖ

జనాభా పెంపు కోసం శృంగార మంత్రిత్వశాఖ

russia-considers-population-growth-measures

రష్యా మంత్రిత్వశాఖ: ప్రస్తుతం గణనీయమైన జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. జననాల రేటు గణనీయంగా తగ్గిపోవడం, ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణ నష్టం పెరగడం జనాభా సమస్యను మరింత తీవ్రమయ్యేలా చేస్తోంది.

ఈ నేపథ్యంలో, దేశంలోని జననాల రేటును పెంచేందుకు రష్యా ప్రభుత్వం ప్రత్యేక పథకాలపై దృష్టి సారిస్తోంది. “సె** మినిస్ట్రీ” (శృంగార మంత్రిత్వశాఖ) ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ముందుకు రావడం చర్చనీయాంశమైంది.

జననాల రేటును పెంచేందుకు ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చర్యలను పరిశీలిస్తోంది. ముఖ్యంగా, రాత్రివేళ ఇంటర్నెట్‌ను ఆఫ్ చేయడం, కరెంటును తాత్కాలికంగా నిలిపివేయడం వంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇలా చేయడం ద్వారా జంటల మధ్య సాన్నిహిత్యం పెరగడమే కాకుండా, సంతానోత్పత్తికి ఇది సహాయపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఇతర చర్యల్లో ఇంట్లో ఉండే తల్లులకు వేతనం ఇవ్వడం, డేటింగ్‌ను ప్రోత్సహించడం, హోటళ్లలో బస చేసే జంటల ఖర్చును ప్రభుత్వం భరించడం వంటి ప్రోత్సాహక చర్యలు ఉన్నాయి.

రష్యాలో 2023 మొదటి అర్థభాగంలో కేవలం 5,99,600 చిన్నారులు మాత్రమే జన్మించారు, గత ఏడాదితో పోలిస్తే ఇది 16 వేల జననాలు తక్కువ. ఇదే సమయంలో, మరణాలు కూడా 3,25,100కు చేరడంతో జనాభా సహజ క్షీణత పెరిగినట్లు రికార్డు అయింది.

ఈ నూతన చర్యలు రష్యా జనాభా పెంపుదలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అనేది ఆసక్తికరంగా మారింది. రష్యా జనాభా సమస్యను పరిష్కరించేందుకు ఈ చర్యలు ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తాయో వేచిచూడాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular