fbpx
Sunday, January 5, 2025
HomeMovie Newsనాగ్ అశ్విన్ - మరో లేడీ ఒరియంటెడ్ ప్రాజెక్ట్?

నాగ్ అశ్విన్ – మరో లేడీ ఒరియంటెడ్ ప్రాజెక్ట్?

NAG-ASHWIN-PLANNING-A-LADY-ORIENTED-MOVIE
NAG-ASHWIN-PLANNING-A-LADY-ORIENTED-MOVIE

మూవీడెస్క్: ‘కల్కి 2898 ఏడి’తో పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరుగాంచిన నాగ్ అశ్విన్, తన విభిన్న కథనాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

ఈ ఫ్యూచరిస్టిక్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు పొందిన అశ్విన్, ఇప్పుడు మరో లేడీ ఒరియంటెడ్ కథపై దృష్టి సారించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌తో చర్చలు జరిపినట్లు టాక్. ఆమెకు కథ బాగా నచ్చడంతో, ఓకే చెప్పినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.

భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కించాలని ప్రముఖ నిర్మాణ సంస్థ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.

‘కల్కి పార్ట్ 2’ పూర్తిచేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు అశ్విన్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

నాగ్ అశ్విన్ – అలియా భట్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే ఈ ప్రాజెక్ట్, ఫీమేల్ ఒరియంటెడ్ సినిమాల్లో అతి పెద్దదిగా ఉండే అవకాశముందని అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular