టాలీవుడ్: ఏషియన్ సినిమాస్ వాళ్ళు మొదలు డిస్ట్రిబ్యూషన్ తో సినిమా ఇండస్ట్రీ లో అడుగుపెట్టారు. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఈ బ్యానర్ పై వరుస సినిమాలని లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య , శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ‘లవ్ స్టోరీ’ సినిమాని తీస్తున్నారు. ఈ సినిమా ఈ సమ్మర్ కే విడుదల అవ్వాల్సింది కానీ కరోనా కారణంగా ఆగిపోయింది. నాగార్జున – ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో ఒక యాక్షన్ సినిమాని చేయబోతున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు. నాగ శౌర్య తో కూడా ఒక సినిమా ప్రస్తుతం షూటింగ్ లో ఉంది. ఈ మధ్యనే నిఖిల్ తో కూడా ఒక సినిమా ప్రకటించారు ఈ ప్రొడ్యూసర్స్.
ఇపుడు శర్వానంద్ తో మరొక సినిమా ప్రకటించింది ఈ ప్రొడక్షన్ హౌస్. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ హౌస్ చేతిలో 5 సినిమాలు ఉన్నాయి. కెరీర్ ప్రారంభం నుండి విలక్షణమైన పాత్రలను విభిన్నమైన సినిమాలని చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తన బాల్య మిత్రుడు రామ్ చరణ్ కూడా శర్వా యాక్టింగ్ లో ఇంటెన్సిటీ బాగా నచ్చుతుందని చెప్పాడు. ‘గమ్యం’, ‘ప్రస్థానం’, ‘అందరి బంధువయా’, ‘రన్ రాజా రన్’ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’, ‘ఎక్సప్రెస్ రాజా’, ‘శతమానం భవతి’, ‘మహానుభావుడు’ సినిమాలతో అన్ని పాత్రలు కొత్తగానే అనిపిస్తాయి. ‘పడి పడి లేచే మనసు’, ‘రణ రంగం’, ‘జాను’ చిత్రాలు సరిగ్గా ఆడకపోవడం తో తర్వాతి సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు శర్వా. ప్రస్తుతం శర్వా శ్రీకారం అనే సినిమా చేస్తున్నాడు. కరోనా వల్ల ఈ సినిమా ఆలస్యం అయింది. లేదంటే ఇప్పటికి ఈ సినిమా విడుదల అవ్వాల్సింది.