ఆంధ్రప్రదేశ్: తెలుగు రాజకీయాల్లో హైలైట్ అయిన కనుమూరు రఘురామ కృష్ణంరాజుకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి రాష్ట్ర సర్కారు సంచలనం సృష్టించింది.
గత ఐదేళ్లుగా వైసీపీ ఎంపీగా ఉండి, ఆ పార్టీ అధినేత జగన్‌పై విమర్శలు గుప్పిస్తూ మీడియా, సోషల్ మీడియాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న రఘురామ, ఈసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.
రఘురామకు మంత్రిపదవి లేదా ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుందనుకుంటే, అందులోనూ నిరాశే ఎదురైంది. ఆ తర్వాత జనసేనలో సామాజిక సమీకరణాల కారణంగా పవన్, చంద్రబాబు కలిసికట్టుగా రఘురామకు డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిర్ణయం జగన్మోహన్ రెడ్డికి కూడా కాస్త ఇబ్బంది కలిగించేలా ఉందని భావిస్తున్నారు. రఘురామ డిప్యూటీ స్పీకర్ స్థానంలో కూర్చుంటే, జగన్ తనను “అధ్యక్షా” అని పిలవాల్సి రావడం రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా మారింది.
ఇక, తనపై గతంలో జరిగిన దాడి కేసులపై పోలీసులను ప్రశ్నిస్తూ, ప్రభుత్వంపై తన ప్రశ్నలతో రఘురామ హైపర్ క్రియేటివ్‌గా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని ఉద్దేశ్యపూర్వకంగా ప్రస్తావిస్తూ దాడి చేసిన పోలీసులపై చర్యలు కోరారు.
ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ హోదా పొందడంతో, రఘురామ తన ప్రశ్నలను మరింత ఘాటుగా ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రఘురామ డిప్యూటీ స్పీకర్‌గా నియమించడం ద్వారా మరింత ఆసక్తికర రాజకీయ పరిణామాలు జరిగే అవకాశముంది.