fbpx
Thursday, December 26, 2024
HomeMovie Newsదగ్గుబాటి రానా..OTT లో మరో స్పెషల్ షో

దగ్గుబాటి రానా..OTT లో మరో స్పెషల్ షో

ANOTHER-OTT-SPECIAL-SHOW-FROM-DAGGUBATI-RANA
ANOTHER-OTT-SPECIAL-SHOW-FROM-DAGGUBATI-RANA

మూవీడెస్క్: టాలెంటెడ్ హీరోగా టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం పొందిన దగ్గుబాటి రానా, ఇప్పుడు ఓ కొత్త అవతారంలో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు.

నవంబర్ 23న ప్రారంభం కానున్న ‘ది రానా దగ్గుబాటి షో’ ద్వారా ప్రైమ్ వీడియో ప్రేక్షకులకు మరింత కొత్త అనుభూతిని అందించనుంది.

తన స్వంత ప్రొడక్షన్ సంస్థ స్పిరిట్ మీడియా ద్వారా నిర్మిస్తున్న ఈ షో ఎనిమిది ఎపిసోడ్లతో సాగే ఈ సిరీస్‌లో టాలీవుడ్ ప్రముఖులతో సరదా ముచ్చట్లు, గేమ్స్, ఆసక్తికరమైన చర్చలు ఉంటాయని తెలుస్తోంది.

ఈ షోలో దుల్కర్ సల్మాన్, నాగ చైతన్య, సిద్దు జొన్నలగడ్డ, శ్రీలీల, నాని, ఎస్.ఎస్. రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ వంటి టాప్ సెలబ్రిటీలతో కలిసి రానా కొత్తగా ఉన్న అనుభవాలను పంచుకుంటారు.

సాధారణ టాక్ షోలతో పోలిస్తే ఈ షో మరింత ఆసక్తికరంగా, వ్యక్తిగత జీవితంలోని క్షణాలను పంచుకోవడంతో భిన్నంగా ఉంటుందని సమాచారం.

ప్రైమ్ వీడియో ప్రకటన ప్రకారం, ఈ షో ప్రతి శనివారం ఒక కొత్త ఎపిసోడ్ తో 240 దేశాల్లో అందుబాటులోకి రానుంది.

రానా మాట్లాడుతూ, “మిత్రులతో సరదాగా గడుపుతూ నిజమైన అనుభూతులను పంచుకోవడమే ఈ షో ప్రత్యేకత” అని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular