అమరావతి: సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు చేస్తే అరెస్ట్ చేయరా? – ఏపీ హైకోర్టు
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని నిందితుడు సత్య నీరజ్ కుమార్ అత్యవసర విచారణ కోసం దరఖాస్తు చేసుకోగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ అభ్యర్థనను తిరస్కరించింది.
ఇతరులను ఇబ్బంది పెట్టేలా, ఆందోళన కలిగించేలా పోస్టులు పెడితే అరెస్ట్ చేయరాదా? అని న్యాయస్థానం సూటిగా ప్రశ్నించింది.
తిరుపతి తూర్పు పోలీసుల ఆధారంగా సత్య నీరజ్ కుమార్‌పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరియు ఆయన కుటుంబం ప్రతిష్టను దెబ్బతీసేలా సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టినందుకు కేసు నమోదైన విషయం తెలిసిందే.
హైకోర్టు ఈ పిటిషన్‌పై సాధారణ పద్ధతిలో విచారణ జరుపుతామని, తక్షణమే ముందస్తు బెయిల్‌పై విచారణ చేపట్టేందుకు అవసరం లేదని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.