ఢిల్లీ: నవంబరు 22న ప్రారంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ముందు టీమిండియాకు కష్టాలు ఎదురవుతున్నాయి. కీలక ఆటగాళ్ళు గాయాలపాలయ్యారు. టీమిండియాకు గాయాల సమస్యలు ఇబ్బందిగా మారాయి.
ముఖ్యంగా ఆస్ట్రేలియాతో వంటి బలమైన జట్టుతో తలపడే ముందు ఇది కీలకంగా మారింది. నవంబరు 22నాటికి గిల్ లేదా రాహుల్ అందుబాటులో ఉంటారా లేదా అనేది కీలకంగా మారింది.
శుభ్ మాన్ గిల్ గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్లో స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తూ గిల్ ఎడమచేతి బొటనవేలికి గాయం అయింది.
వెంటనే మైదానం వీడిన గిల్ తిరిగి ప్రాక్టీస్‌లో పాల్గొనలేదు. గాయం తీవ్రతపై ఇంకా పూర్తిస్థాయి సమాచారం అందుబాటులో లేకపోయినప్పటికీ, గాయం నయం కావడానికి కనీసం రెండు వారాల సమయం పడుతుందని సమాచారం.
గిల్ గాయపడడం టీమిండియా టాపార్డర్ కూర్పుపై ప్రభావం చూపనుంది. టెస్టుల్లో వన్ డౌన్లో నిలకడగా రాణిస్తున్న గిల్, అనేక విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియాతో కలిసి ఆస్ట్రేలియాలో లేకపోవడంతో, గిల్ ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్‌తో కలిసి బరిలో దిగే అవకాశం ఉంది. అయితే, గిల్ గాయంతో టీమిండియా మేనేజ్మెంట్ కొత్త ప్రత్యామ్నాయాల కోసం చూస్తోంది.
మరోవైపు, కేఎల్ రాహుల్ కూడా ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడటంతో టీమిండియా ఓపెనింగ్ భాగస్వామ్యం మరింత అనిశ్చితి లోనైంది. రాహుల్ ఇటీవల తన ఫామ్ కోల్పోయి ఒత్తిడిలో ఉన్నాడు.