టాలీవుడ్ : ఇప్పుడంతా వెబ్ సిరీస్ ల హవా నడుస్తుంది. ఇప్పటివరకు తెలుగు లో అంతగా పేరు పొందిన వెబ్ సిరీస్ లు లేనప్పటికీ అడపా దడపా తెలుగు లో కూడా వెబ్ సిరీస్ ల జోరు పెరుగుతుంది. వీటి వల్ల కొత్త వాళ్ళకి అవకాశాలు అలాగే కథతో, కథనంతో ప్రయోగాలు చేయగలిగే వెసులుబాటు ఉండడంతో సినిమా మేకింగ్ లో కొత్త మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇంగ్లీష్ లో హిందీ లో కొంచెం ఎక్కువ సంఖ్యలోనే వెబ్ సిరీస్లు వచ్చినా కూడా తెలుగు లో ఇప్పటివరకు అంతగా రాలేదు. వచ్చినా కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఎదో మామూలుగా ఉన్నాయి అనే టాక్ వచ్చాయి.
ప్రస్తుతం ‘మెట్రో కథలు’ అనే కొత్త వెబ్ సిరీస్ ఆహా లో స్ట్రీమ్ అవబోతుంది. ఒక మెట్రో నగరంలో ఉండే వివిధ రకాల ప్రజలనుండి కొన్ని కథలని చూపిస్తూ పారలెల్ నరేషన్ చేస్తూ చివరకి వాళ్లందరికీ కలిపి ఒక కామన్ ఎలిమెంట్ నో లేదా ఎదో ఒక కామన్ సీన్ తో ఆ స్టోరీస్ అన్ని ముడిపెడతారు. దీనిపై ఇప్పటికే తెలుగులో ‘వేదం’, ‘ఓం శాంతి’, ‘మనమంతా’ లాంటి సినిమాలు వచ్చాయి. ఇవి అంతగా ఆడనప్పటికీ సినిమాకి క్రిటిక్స్ నుండి ప్రశంసలు వచ్చాయి. ఇదే థీమ్ పైన బాలీవుడ్ లో వచ్చిన ‘లైఫ్ ఇన్ మెట్రో’ అనే సినిమా మంచిగానే ఆడింది. ఈ వెబ్ సిరీస్ లో కూడా కొంచెం కొత్త వాళ్ళతో పాటు రాజీవ్ కనకాల లాంటి పేరున్న నటులుండడం వల్లన కథం కొంచెం మంచిగా ఉండొచ్చనే ఊహాగానాలు ఉన్నాయి.
ఒక పట్నం నాలుగు కథలు అనే టాగ్ లైన్ తో వస్తున్న ఈ వెబ్ సిరీస్ ఆగష్టు 14 న ఆహా ఓటీటీ లో విడుదల అవబోతుంది. ఈ సిరీస్ ని కరుణ కుమార్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. ఇందులో రాజీవ్ కనకాల తో పాటు సన, బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా , గాయత్రీ భార్గవి, జార్జి రెడ్డి ఫేమ్ తిరువీర్ తో పాటు ఇంకొందరు కొత్త నటులు నటిస్తున్నారు. ఈ సిరీస్ పోస్టర్ ని ఇవాళ గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ట్విట్టర్ లో విడుదల చేసారు.