తెలంగాణ: హైదరాబాద్ అనగానే పర్యాటకులకు బిర్యానీ, హలీం వంటి వంటకాల మధురం గుర్తుకు వస్తుంది. కానీ, ఇటీవల నగరంలోని ఆహార నాణ్యతపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
పలు హోటళ్ళలో ఫుడ్ పాయిజనింగ్ కేసులు, గడువు తీరిన పదార్థాల వినియోగం వంటి ఘటనల వల్ల నగరపు ఖ్యాతి దెబ్బతింటోంది.
గత రెండు నెలలలో 84 శాతం ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. బిర్యానీ వంటి ప్రసిద్ధ వంటకాల్లో కూడా బొద్దింకలు, కల్తీ పదార్థాల వినియోగం వెలుగు చూస్తున్నాయి.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) సర్వే ప్రకారం, కల్తీ ఆహార అంశంలో హైదరాబాద్ అత్యంత దారుణ స్థాయిలో నిలవడం నగర ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
హైదరాబాద్‌లోని 62 శాతం హోటళ్ళలో గడువు తీరిన పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
దీనివల్ల పర్యాటకులు, స్థానిక ప్రజలు భోజనానికి ముందుగానే వెనుకడుగు వేస్తున్నారు. నగరంలో ఆహార నాణ్యత క్షీణించడంపై ప్రజలు అధికారులను విమర్శిస్తున్నారు.