మూవీడెస్క్: టాలీవుడ్ నటి రేణు దేశాయ్ తన యాక్టివ్ సోషల్ మీడియా ప్రస్తావనతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది.
తన వ్యక్తిగత జీవితం, జంతువుల సంక్షేమం, సమాజంపై ఆవగాహనతో ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షించే రేణు, ఇటీవల ఒక షాకింగ్ వీడియోను షేర్ చేసింది.
తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో సెలైన్ ఎక్కించుకుంటున్న వీడియోను షేర్ చేసిన రేణు, “ఆధునిక వైద్యశాస్త్రం మన శరీరాన్ని బతికిస్తూ ఉంచుతుంది” అనే క్యాప్షన్ ఇచ్చింది.
అయితే, ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేసింది, ఆమె ఆరోగ్యం బాగానే ఉందా అనే విషయంపై స్పష్టత లేకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారడంతో, రేణు ఆరోగ్యం గురించి అనేక చర్చలు జరుగుతున్నాయి.
ఈ వీడియోపై రేణు ఏమీ స్పందించకపోయినా, ఆమెకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే సమయంలో రేణు దేశాయ్ ఇటీవలే బిగ్ స్క్రీన్‌కి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఆమె పోషించిన పాజిటివ్ రోల్‌కి మంచి స్పందన వచ్చింది.
పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన బద్రి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రేణు, విడాకుల తర్వాత కూడా తన పిల్లలతో ఆనందంగా జీవిస్తూ, పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటోంది.
అయితే, తాజాగా ఈ సెలైన్ వీడియో ఆమె ఫాలోవర్స్‌లో ఆందోళన రేకెత్తించింది.