అమరావతి: ఏపీ అసెంబ్లీలో వైఎస్ సునీత రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఈ రోజు ఏపీ అసెంబ్లీకి వెళ్లారు.
ఆమె రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితతో భేటీ అయి, తన తండ్రి హత్య కేసు గురించి చర్చించారు.
ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి, జైలు అధికారులకు రాసిన లేఖపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని సునీత విజ్ఞప్తి చేశారు.
ఆ తర్వాత, ఆమె సీఎంఓ అధికారులతో కూడా సమావేశమయ్యారు. తన తండ్రి హత్య కేసు పురోగతిపై వారితో వివరాలు తెలుసుకుని, ఈ కేసులో నిజమైన దోషులను శిక్షించేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు సమాచారం.
ఇక, ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వేడి వాతావరణంలో కొనసాగుతున్నా, ప్రతిపక్షం లేకపోయినా, అధికార తెలుగుదేశం-జనసేన-భారతీయ జనతా పార్టీ సభ్యులు ప్రభుత్వం లోపాలను, నియోజకవర్గాల సమస్యలను సభలో లేవనెత్తుతుంటున్నారు.
ఈ పరిస్థితుల్లో, వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత రెడ్డి, భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డితో కలిసి అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు.
ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కూడ సమావేశమైనట్లు తెలుస్తోంది.
2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులలోని తన నివాసంలో దారుణంగా హత్యకు గురయ్యారు.
ఆ తరువాత వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది, ప్రస్తుతం ఈ హత్యకేసు దర్యాప్తు దశలో ఉంది.
ఈ కేసులో కీలకమైన పరిణామం, దస్తగిరి అప్రూవర్‌గా మారడం. సునీత రెడ్డి ఈ కేసు పురోగతిని తెలుసుకునేందుకు తాజాగా అసెంబ్లీకి వచ్చారు.
గతంలో కడప జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వీ విద్యాసాగర్ నాయుడితో ఆమె సమావేశమైనట్లు సమాచారం.
ఆమె తన తండ్రి హత్య కేసులో ప్రమేయం ఉన్న వారందరినీ చట్టపరంగా శిక్షపడేలా పోరాటం కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.