బ్రెజిల్: జీ20 సదస్సు సందర్భంగా బ్రెజిల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్‌తో ముఖ్య సమావేశం జరిపారు. ఈ సమావేశంలో ప్రధానంగా భారత్‌కు పరారైన ఆర్థిక నేరగాళ్ల గురించి చర్చ జరిగింది.
నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, సంజయ్ భండారి వంటి నేరగాళ్లను భారత్‌కు అప్పగించాల్సిన ప్రాముఖ్యతను మోదీ జీ20 వేదికలో బలంగా ప్రస్తావించారు.
విజయ్ మాల్యా రూ.9,000 కోట్ల బ్యాంకు రుణాలను ఎగవేసి 2016లో లండన్‌కు పారిపోయిన విషయం తెలిసిందే. అలాగే నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.13,000 కోట్ల స్కామ్ చేసి లండన్‌లో తలదాచుకున్నాడు.
వీరిని భారత్‌కు రప్పించేందుకు ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, న్యాయపరమైన సమస్యలతో ప్రక్రియ సాఫీగా సాగడం లేదు.
ఇటీవల బ్రిటన్ కోర్టు నీరవ్ మోదీ అప్పగింత పిటిషన్‌ను తిరస్కరించినప్పటికీ, బ్రిటన్ ప్రభుత్వం భారత్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటోంది.
జీ20 సమావేశంలో మోదీ ఈ అంశాన్ని ప్రపంచ వేదికపై ప్రస్తావించారు. భారత్ ఆర్థిక నేరగాళ్లను దేశానికి రప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని, అంతర్జాతీయ సహకారం అందించాల్సిన అవసరాన్ని దృఢంగా చెప్పారు.