శాండల్ వుడ్: ఈ మధ్య కొన్ని సినిమాలకి వచ్చిన హైప్ వల్ల ఆయా భాషల్లో తీసే ప్రతీ సినిమాని ‘పాన్ ఇండియా’ రేంజ్ అని ఊహించుకుంటూ సినిమాలని సిద్ధం చేస్తున్నారు మేకర్స్. బాహుబలి తర్వాత తెలుగులో, కే జి ఎఫ్ తర్వాత కన్నడలో ఈ పాన్ ఇండియా సినిమాల ప్రవాహం పెరిగింది. కానీ ఆ సినిమాల్లో ఉండే కంటెంట్ మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో ఉండట్లేదు అనేది ఇన్ సైడ్ టాక్.
కన్నడ హీరో ‘ధ్రువ సర్జ‘ హీరోగా నటిస్తున్న సినిమా ‘పొగరు’. ఈ ‘ధ్రువ సర్జ’ తెలుగు వారికి సుపరిచితం అయిన యాక్షన్ హీరో అర్జున్ కి అల్లుడు. ఈ సినిమాలో ధ్రువ తో పాటు రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చెయ్యాలని సౌత్ ఇండియా అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా నుండి ఇవాళ ఒక పాటని విడుదల చేసారు. పేరుకి పాన్ ఇండియా అని పెట్టుకున్నారు కానీ కంటెంట్, ఆ పాట పిక్చరైజెశన్ అన్నీ చూస్తే ఒక మామూలు రొటీన్ కమెర్షియల్ సినిమాలాగే అనిపిస్తుంది. ఒక పాట తో ఆలా అనడం కరెక్ట్ కాదు కాదు ఈ పాట చూసిన తర్వాత మాత్రం అనక తప్పట్లేదు. అందరూ కొత్త కొత్త కథలతో , ప్రయోగాలతో వస్తుంటే ఇంకా అమ్మాయిల వెంబడి పడి పాటలు పాడడం, అమ్మాయి తనకి హీరో నచ్చనట్టు ఉన్నా కూడా హీరో తో డాన్స్ చెయ్యడం, హీరో ఎంత హరాస్మెంట్ చేస్తున్నా కూడా పాట వస్తున్నంతసేపు హీరో చుట్టూనే ఉండడం చూస్తుంటే ఆ రొటీన్ అనే మాటలు తప్పట్లేదు.
ఇక రష్మిక లుక్ విషయానికి వస్తే రష్మిక తన మొదటి సినిమా అయిన ‘కిరిక్ పార్టీ'(కన్నడ వెర్షన్) లో ఉన్న లుక్ కన్నడ లో ఇప్పటివరకు తాను నటించిన దాదాపు అన్ని సినిమాల్లో అదే లుక్ మైంటైన్ చేసారు కన్నడ మూవీ మేకర్స్. ఈ సినిమాలో కూడా తేడా ఏం లేదు. ఇక ఈ సినిమా కంటెంట్ గురించి ఇప్పుడు చెప్పడం సబబు కాదు కానీ ఈ పాట చూస్తున్నంత సేపు ఏదో ఇబ్బందైన ఫీలింగ్ కలుగుతుందనడంలో తప్పులేదేమో.