మూవీడెస్క్: యాక్షన్ హీరో గోపీచంద్, తన మాస్ ఇమేజ్‌తో ప్రేక్షకులను అలరించినా, ఇటీవల ఆయన కెరీర్ గాడిలోపడటం లేదు.
‘లౌక్యం’తో 2014లో బిగ్ హిట్ అందుకున్న గోపీచంద్, ఆ తర్వాత వరుస ఫ్లాప్స్ ఎదుర్కొంటున్నాడు.
‘గౌతమ్ నంద,’ ‘సిటీమార్,’ వంటి చిత్రాలతో ఓ మోస్తరుగా ఆడినా, పెద్ద హిట్ కొట్టలేదు. ఇటీవలి కాలంలో వచ్చిన ‘విశ్వం’ డిజాస్టర్ కావడంతో మార్కెట్ పై ప్రభావం పడింది.
గోపీచంద్, ‘జిల్’ మరియు ‘రాధేశ్యామ్’ చిత్రాల దర్శకుడు రాధాకృష్ణతో ఓ కొత్త సినిమాను ప్లాన్ చేస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్‌కి యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ ముందుగా ఆసక్తి చూపించింది. అయితే, రీసెంట్గా యూవీ క్రియేషన్స్ ఆర్థిక సమస్యల కారణంగా, ఈ ప్రాజెక్ట్‌కు అడ్డంకులు ఎదురయ్యాయి.
ముఖ్యంగా,. ‘కంగువా’ పెద్దగా లాభాలు అందుకోకపోవడం, అలాగే మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ వంటి భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లలో పెట్టుబడులు పెట్టడంతో యూవీ క్రియేషన్స్ మరిన్ని ప్రాజెక్టులను హోల్డ్‌లో పెట్టినట్లు సమాచారం.
గోపీచంద్ సినిమా కోసం కొత్త నిర్మాణ సంస్థ 70 ఎం ఎం ప్రొడక్షన్స్ ముందుకు వచ్చిందని, భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను టేకోవర్ చేసినట్లు తెలుస్తోంది.
ఇది గోపీచంద్ కెరీర్‌కు కీలకమైన ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే, యూవీ క్రియేషన్స్ ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయడంలో బిజీగా ఉంది.
ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి నిర్మిస్తోంది. ‘విశ్వంభర’ విడుదల తర్వాత మళ్లీ కొత్త ప్రాజెక్ట్స్ ప్రారంభించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.