మూవీడెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతోనే కాకుండా వ్యక్తిత్వంతోనూ ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన పవన్, తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.
పవన్ పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టి ఉంటే పాన్ ఇండియా స్టార్ గా ఉండేవాడని అనేక మంది అంటుంటారు.
అయితే ప్రజాసేవ కోసం పవన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి, జనసేన పార్టీని బలపరుస్తూ, 2024లో విజయవంతంగా డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు.
పవన్ కళ్యాణ్ పై ప్రేమ, గౌరవం ఉన్న హీరోల్లో నేచురల్ స్టార్ నాని కూడా ఒకరు. నానికి పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేకమైన అభిమానముంది.
తాజాగా ప్రారంభమైన ‘రానా దగ్గుబాటి షో’ మొదటి ఎపిసోడ్లో నాని, తేజ సజ్జా, ప్రియాంకా అరుళ్ మోహన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రానా వివిధ అంశాలపై చర్చించగా, పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన వచ్చింది.
ప్రియాంకా ‘ఓజీ’ సినిమా గురించి మాట్లాడుతూ, పవన్‌తో పని చేయడం ఒక ప్రత్యేకమైన అనుభవమని చెప్పింది.
దీనిపై రానా మాట్లాడుతూ, పవన్ సినిమాలే కాకుండా రాజకీయాల్లోనూ ఆసక్తి క్రియేట్ చేశారని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా నాని పవన్ గురించి మాట్లాడుతూ, “సినిమాల్లో ఉండగా పవన్ కళ్యాణ్ ఒక మిస్టిక్ పర్సనాలిటీలా అనిపిస్తాడు.
కానీ పాలిటిక్స్‌లోకి వచ్చాక మనిషిగా ఎంతో తెలుసుకున్న ఫీలింగ్ కలిగింది. ఇది నిజంగా గ్రేట్” అని నాని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ విజయం సాధించకముందే కూడా నాని, ఆయన గురించి పాజిటివ్‌గా స్పందించారు.
ఇప్పుడు మరోసారి ‘రానా షో’లో పవన్‌ను పొగిడిన నానికి, పవన్ అభిమానులు సపోర్ట్ చూపిస్తున్నారు.