ఏపీ: గౌతమ్ అదానీ లంచాల వివాదం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా, అదానీ 1750 కోట్ల రూపాయలను ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు ఇచ్చారని ఎఫ్‌బీఐ ఆధారాలతో పేర్కొనడం సంచలనం కలిగించింది.
సోలార్ ఎనర్జీ ఒప్పందాల్లో అనేక అనుమానాస్పద చర్యలు చోటుచేసుకున్నాయని, ప్రత్యేకంగా టెండర్ల ప్రక్రియ లేకుండానే అదానీతో జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ ఒప్పందం అదానీకి విపరీతమైన లాభాలను అందించడంతో పాటు, బీజేపీని నేరుగా మద్దతు ఇస్తున్న రాష్ట్రాలకే పరిమితమైంది.
ఇతర ప్రతిపక్షపాలిత రాష్ట్రాలు మాత్రం ఈ ఒప్పందాలకు దూరంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ నేతలు, ముఖ్యంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఈ అంశాన్ని అసెంబ్లీలో పెద్ద ఎత్తున ఎండగట్టారు.
అయితే, బీజేపీ, జనసేన లాంటి పార్టీలు మాత్రం ఈ విషయంపై మౌనంగా వ్యవహరించడం గమనార్హం.
జగన్ మౌనం పలు అనుమానాలను రేకిత్తిస్తోంది. తనపై వచ్చిన విమర్శలపై స్పందించకపోవడం, పైవారి భరోసా కారణంగానే తన ధైర్యం అంటున్నాయి.
ఇదే సమయంలో కేంద్రంలో అదానీకి ఉన్న సన్నిహిత సంబంధాలు జగన్‌ను రక్షించే అవకాశమున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ కేసు అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరగడం, భారత్‌లో ఆర్థిక, రాజకీయ వ్యవస్థలపై ప్రభావం చూపించడం వల్ల ఇది పెద్ద చర్చనీయాంశమైంది.