హైదరాబాద్: ఆర్జీవీ: ప్రఖ్యాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన అరెస్ట్ వివాదం చర్చనీయాంశమైంది. ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో విచారణ నిమిత్తం ఈరోజు ఉదయం 11 గంటలకు హాజరుకావాల్సిందిగా వర్మకు నోటీసులు పంపారు. కానీ ఆయన వ్యక్తిగతంగా హాజరుకాలేదు.
ఆయన లీగల్ టీమ్ ప్రకారం, బీఎన్ఎస్ఎస్ చట్టం కింద వర్చువల్ విచారణకు హాజరయ్యే హక్కు ఉంది.
రామ్ గోపాల్ వర్మ ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ, నేరుగా విచారణకు హాజరుకావడం కుదరదని, చట్టప్రకారం ఈ వివాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమని తెలియజేశారు.
ఆర్జీవీ నోటీసులపై స్పందించకపోవడంతో, ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వచ్చారు.
అయితే సెర్చ్ వారెంట్ లేకపోవడంతో, ఆయన ఇంట్లోకి వెళ్లలేకపోయారు. జుబ్లీహిల్స్‌లోని ఆర్జీవీ డెన్ వద్ద సాయంత్రం వరకు ఎదురు చూసిన పోలీసులు చివరికి వెనుదిరిగారు.
ఈ ఘటనపై రామ్ గోపాల్ వర్మ లీగల్ టీమ్ స్పందిస్తూ, ఈ అరెస్ట్ ప్రయత్నాలు చట్టానికి వ్యతిరేకమని, సరైన ప్రక్రియలను పాటించాలన్నది తమ వాదన అని చెప్పారు.