టాలీవుడ్: టాలీవుడ్ టాప్ డైరెక్టర్, ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా పేరున్న సుకుమార్ ‘కనబడుట లేదు’ అనే సినిమా టీజర్ విడుదల చేసారు. ఈ సినిమా సస్పెన్స్ అండ్ లవ్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కింది. సరయు తలశిల సమర్పణలో ఎస్ఎస్ ఫిలిమ్స్, శ్రీ పాద క్రియేషన్స్ షేడ్ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి మధు పొన్నాస్ సంగీతం సమకూర్చగా సందీప్ బద్దుల సినిమాటోగ్రఫీ అందించారు. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే నిన్న విడుదలైన ఈ సినిమా టీజర్ కి కూడా మంచి స్పందన లభించింది.
ఈ సినిమా టీజర్ చూసిన ప్రతీ వాళ్ళు టీజర్ ఇలా కూడా కట్ చెయ్యొచ్చా అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. తప్పిపోయిన వ్యక్తి, రెండు మృతదేహాలు వాటికి సంబంధించిన అనుమానితులని విచారించడం వంటి నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు టీజర్‌ని బట్టి తెలుస్తోంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ఆద్యంతం ఆకట్టుకునేలా ఈ సినిమా రూపొందుతుంది. విశాఖపట్నం నేపథ్యంలో నిర్మిస్తున్న ఈ సినిమాలో సుక్రాంత్ వీరెల్ల హీరోగా నటిస్తున్నాడు. యుగ్రాం, శశిత కోన, నీలిమ, పతకం శెట్టి సౌమ్యా శెట్టి, కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ రాజు, ఉమామహేశ్వర్ రావు, కిశోర్, శ్యామ్, మధు.. ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.