మూవీడెస్క్: తమిళ స్టార్ హీరో సూర్య నటించిన పాన్-ఇండియా చిత్రం కంగువా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేదు.
సిరుతై శివ దర్శకత్వంలో రూ.350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ ఎపిక్ ఫాంటసీ డ్రామా, మొదటిరోజే నెగిటివ్ టాక్ రావడంతో, రెండు రోజుల్లోనే కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.
మూవీ థియేట్రికల్ హక్కులతో పాటు ఓటీటీ హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ హక్కులను రికార్డు స్థాయిలో కొనుగోలు చేసింది.
డిసెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో కంగువా స్ట్రీమింగ్ కావాల్సి ఉంది.
అయితే, ఇప్పుడు ఓటీటీ విడుదలకు ముందే హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ కావడం అమెజాన్‌కు పెద్ద షాకుగా మారింది.
ఈ లీక్ అమెజాన్ వ్యూయర్ కౌంట్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. భారీ డిజాస్టర్‌గా మారిన ఈ సినిమా థియేటర్లలోనే బలహీనతను చూపింది.
ఇక పైరసీ లీక్ కారణంగా ఓటీటీ ద్వారా రాబట్టాల్సిన ఆదాయం కూడా తగ్గే ప్రమాదం ఉంది.
లీక్ అంశం తెరపైకి రావడంతో అమెజాన్ ప్రైమ్ ఇప్పుడే స్ట్రీమింగ్‌ను ముందుకు జరిపే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
అయితే, ఈ లీక్ వ్యవహారంపై ఇంకా అమెజాన్ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
వ్యూయర్స్ కౌంట్‌ను పెంచడం కష్టంగా మారుతున్న ఈ తరుణంలో, కంగువాకు ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుండి ఎలా రిస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి.