న్యూఢిల్లీ: ప్రతి ఏటా 60 లక్షల కొత్త జాబ్ కార్డులు: కేంద్ర మంత్రి పెమ్మసాని
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద ప్రతి సంవత్సరం 60 లక్షల కొత్త జాబ్ కార్డులు జారీ చేస్తున్నట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు.
గ్రామీణ అభివృద్ధికి పారదర్శకతను కల్పించడమే తమ లక్ష్యమని, ఆధార్ సీడింగ్‌తో కార్డుల సంస్కరణలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
కేంద్రం, రాష్ట్రాల భాద్యతలు
- జాబ్ కార్డుల తొలగింపు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా పేర్కొంటూ, దీనికి కేంద్రానికి సంబంధం లేదని స్పష్టం చేశారు.
- ఆధార్ సీడింగ్ అవసరంగా ఉండటంతో పారదర్శకత పెరిగిందని, ఈ కారణంగా గత నాలుగేళ్లలో 10.43 కోట్ల కార్మికుల పేర్లు తొలగించబడినట్లు పేర్కొన్నారు.
- ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13-14 కోట్ల జాబ్ కార్డులు ఉండగా, అందులో 9.2 కోట్ల కార్డులు యాక్టివ్ గా ఉన్నట్లు తెలిపారు.
గ్రామీణాభివృద్ధికి కీలక కేటాయింపులు
గ్రామీణాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌కు 57 శాతం నిధులు కేటాయించిందని తెలిపారు. ఈ నిధులతో పథకం కింద గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు.
సభ్యుల ఆరోపణలపై స్పందన
లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ పథకం కింద కార్మికుల పేర్ల తొలగింపుపై విమర్శలు చేశారు. అయితే పెమ్మసాని దీనిపై స్పందిస్తూ, సగటున 30 లక్షల కార్డులు వివిధ కారణాలతో తొలగిస్తుంటారని, ప్రతి ఏడాది సరికొత్తగా 60 లక్షల జాబ్ కార్డులు జారీ అవుతున్నాయని స్పష్టం చేశారు.