మూవీడెస్క్: రానా దగ్గుబాటి ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో లేని ఫీలింగ్ ఫ్యాన్స్‌కు ఉన్నా, అతని ప్లాన్ మాత్రం వెరైటీగా సాగుతోంది.
‘విరాట పర్వం’ తర్వాత హీరోగా రానా ఎలాంటి సినిమాను ప్రకటించకపోవడం అభిమానుల్లో కొంత నిరాశకు గురిచేస్తోంది.
ఆ మధ్య ‘స్పై’లో క్యామియో రోల్, ‘వేట్టయాన్’లో విలన్‌గా మెరిసినా, పూర్తి స్థాయి హీరోగా ఆయన నుంచి సినిమా రాలేదు.
ఇటీవల రానా ఓ ఇంటర్వ్యూలో తన ప్రాజెక్టులపై క్లారిటీ ఇచ్చాడు. “మూడు భారీ ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి, కానీ వాటికి కొంత టైం పడుతుంది” అంటూ ప్రకటించాడు.
మొదటగా ‘హిరణ్య కశ్యప’ ప్రాజెక్టుపై మాట్లాడిన రానా, ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, భారీ ప్రీ ప్రొడక్షన్ జరుగుతోందని చెప్పాడు.
అమర్ చిత్ర కథల నుంచి తీసుకున్న స్క్రిప్ట్ ద్వారా ఈ సినిమాను మరో లెవెల్‌కి తీసుకెళ్లబోతున్నామన్నారు.
తర్వాత తేజతో చేయాల్సిన ‘రాక్షస రాజు’ గురించి మాట్లాడిన రానా, “ఇంతకుముందు వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ స్ఫూర్తితో ఈ కథను తీసుకెళ్తున్నాం.
ఈ సినిమా ఊహించిన దానికంటే మంచి స్థాయిలో చేయాలనుకుంటున్నాం, అందుకే ఆలస్యం అవుతోంది” అని వివరించాడు.
ఇక త్రివిక్రమ్‌తో తాను ఓ సినిమా చేయబోతున్న విషయంపై రానా క్లారిటీ ఇచ్చాడు.. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఇంకా స్టార్ట్ అవ్వాలంటే సమయం పట్టవచ్చని చెప్పాడు.
మొత్తం మీద రానా సైలెంట్‌గా ఉన్నప్పటికీ, అతని లైన్‌లో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.
ఫ్యాన్స్ వేచి చూడాల్సి ఉన్నా, రానా నుంచి వచ్చే ప్రాజెక్టులు కొత్త జానర్‌లలో ఉంటాయని ఇండస్ట్రీలో ఆశలు పెట్టుకుంటున్నారు.