మూవీడెస్క్: టాలీవుడ్ అందాల తార సమంత అనారోగ్య సమస్యలను అధిగమించి, టాప్ హీరోయిన్‌గా ఎదిగిన తీరు ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది.
అయితే కెరీర్ ఆరంభ దశలో సమంత అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నట్లు, తాజాగా ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వెల్లడించారు.
అల్లుడు శీను సినిమాకి సంబంధించి ఆ సమయంలో ఆమె చర్మ సమస్యలతో బాధపడిందని, ఆ పరిస్థితుల్లో ఆమె ధైర్యాన్ని అభినందిస్తున్నానని ఆయన చెప్పారు.
సమంత ఆరోగ్య పరిస్థితి కాస్త సీరియస్ గా ఉండటంతో, షూటింగ్ నిలిపివేయాలని పలువురు సూచించినా, బెల్లంకొండ సురేష్ మాత్రం సమంతకు పూర్తి మద్దతు అందించారు.
హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్‌లో ప్రత్యేక అపార్ట్‌మెంట్ ఏర్పాటు చేయడంతో పాటు, చికిత్స కోసం రూ. 25 లక్షల వరకు సాయం అందించారు.
ఈ సపోర్ట్ ఆమెకు ఆరోగ్యంగా తిరిగి కోలుకోవడానికి ఎంతో సహాయపడిందని, ఆ అనుభవాన్ని ఆమె ఎప్పటికీ మరచిపోలేదని సమాచారం.
తన చర్మ సమస్యలను అధిగమించి, నటనకు ప్రాధాన్యత ఇస్తూ సమంత ముందుకు సాగింది.
అయితే, కొన్ని సంవత్సరాల క్రితం ఆమెకు వచ్చిన మయోసైటిస్ వ్యాధి మరో సవాలుగా మారింది.
దీనిని ఎదుర్కొంటూ, ఇటీవలే సిటాడెల్ వెబ్ సిరీస్ లో భాగంగా ఫైట్స్ చేయడం, శిక్షణలో పాల్గొనడం ఆమె దృఢ నిశ్చయాన్ని వెల్లడించింది.
ఆ సిరీస్ ఆశించిన విజయం సాధించకపోయినా, సమంత చూపిన శ్రద్ధ, కష్టసాధన పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి.