మూవీడెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన పుష్ప 2 లో పుష్పరాజ్ పాత్ర ప్రేక్షకులను మైమరిపించింది.
ముఖ్యంగా జాతర సీక్వెన్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి.
అల్లు అర్జున్ నటనకు మెచ్చుకున్న అభిమానులు, సుకుమార్ విజన్ పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే, ఫహద్ ఫాజిల్ పాత్రపై మాత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
మొదటి భాగంలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రకు గంభీరత, భయాందోళన సృష్టించే ప్రభావం ఉండగా, రెండవ భాగంలో అదే స్థాయిని కొనసాగించలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పాత్ర తీవ్రత తగ్గించబడటమే కాకుండా, కొన్ని సీన్స్ లో అది కామెడీ యాంగిల్ లో కనిపించిందని అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇది పాత్ర బలాన్ని తగ్గించిందని విమర్శకులు అంటున్నారు.
ఫహద్ పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దితే, పుష్ప-2 మొత్తం కొత్త ఎమోషన్ ను అందించేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
తాను ఈ పాత్రను అంగీకరించినప్పటికీ, దాని స్కోప్ తక్కువేనని ముందే గ్రహించినట్లు ఫహద్ తన ఇంటర్వ్యూలో చెప్పడం చర్చనీయాంశమైంది.
“పుష్ప నా కెరీర్‌లో పెద్దగా మార్పు తీసుకురాలేదు. ఇది నా అసలు పని కాదు, సుకుమార్ మీదున్న గౌరవంతో మాత్రమే ఈ ప్రాజెక్ట్ లో భాగమయ్యాను,” అని అతని మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
పుష్ప 2 లో భన్వర్ పాత్రకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల, ఫహద్ పాత్ర సీరియస్ వైపు వెళ్లకుండా నార్మల్ గా మిగిలిపోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి.
అయితే, భవిష్యత్‌లో పుష్ప 3లో ఆ పాత్రకు మరింత ప్రాధాన్యత ఉంటుందా అన్నది ఇప్పుడి ప్రశ్న.