fbpx
Thursday, December 12, 2024
HomeMovie Newsప్రభాస్: మరో స్టార్ దర్శకుడిని లైన్ లో పెట్టిన రెబల్ స్టార్

ప్రభాస్: మరో స్టార్ దర్శకుడిని లైన్ లో పెట్టిన రెబల్ స్టార్

STAR-DIRECTOR-IN-QUEUE-FOR-REBEL-STAR-PRABHAS
STAR-DIRECTOR-IN-QUEUE-FOR-REBEL-STAR-PRABHAS

మూవీడెస్క్: ఇండియన్ సినిమా ప్రేక్షకులలో ప్రభాస్-హోంబలే ఫిల్మ్స్ కాంబినేషన్‌ గురించి ఆసక్తి నెలకొంది.

తాజాగా, హోంబలే ఫిల్మ్స్‌ తో ప్రభాస్ మరో మూడు ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ప్రశాంత్ నీల్ తో సలార్ 2 ప్రాజెక్ట్ ఇప్పటికే సెట్ పై ఉండగా, మరో రెండు ప్రాజెక్ట్‌ల కోసం చర్చలు జరుగుతున్నాయి. 

ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పేరు ప్రచారంలో ఉంది.

విక్రమ్, లియో, ఖైదీ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్లతో తన ప్రతిభను నిరూపించుకున్న లోకేష్, ప్రభాస్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు టాక్.

ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కాంబినేషన్‌ పై అఫీషియల్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ప్రభాస్ ప్రస్తుత ప్రాజెక్ట్‌ల విషయానికి వస్తే, రాజా సాబ్ అనే హారర్ కామెడీ మూవీ మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది.

ఈ ప్రాజెక్ట్ 2025 సమ్మర్ లో విడుదల కానుంది. అంతేకాకుండా, కల్కి 2898 AD పార్ట్ 2 షూటింగ్ పూర్తిచేయాల్సి ఉంది.

ఈ చిత్రంతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా లైన్‌లో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular