హైదరాబాద్: సంధ్య థియేటర్ ఘటనలో పుష్ప 2 ప్రీమియర్ షోపై ఎన్హెచ్ఆర్సీ విచారణ
‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న దుర్ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) విచారణ ప్రారంభించింది. లాయర్ రవికుమార్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, అనుమతి లేకుండా ప్రీమియర్ షోను నిర్వహించడం వల్ల అతి ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులు హాజరై కకావికలం చోటుచేసుకుందని ఆరోపించారు.
*ఘటన వివరాలు *
ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఒక యువతి ప్రాణాలు కోల్పోయిన సంఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ దుర్ఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మరియు మృతురాలి కుటుంబానికి రూ.5 కోట్ల నష్ట పరిహారం అందించాలని రవికుమార్ తన ఫిర్యాదులో కోరారు.
ఎన్హెచ్ఆర్సీ విచారణ
లాయర్ రవికుమార్ ఫిర్యాదును ఎన్హెచ్ఆర్సీ విచారణకు స్వీకరించింది. ప్రజల భద్రతకు గాను సరైన చర్యలు చేపట్టకపోవడం బాధ్యుల నిర్లక్ష్యమని పిటిషనర్ ఆరోపించారు. అనుమతి లేకుండా ప్రదర్శన నిర్వహించినందుకు సంధ్య థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం?
ప్రమాదాన్ని నివారించేందుకు పోలీసులు, థియేటర్ యాజమాన్యం సమయస్ఫూర్తితో వ్యవహరించలేదని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రీమియర్ షోలకు అనుమతులు ఇచ్చే విధానాన్ని సమీక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎన్హెచ్ఆర్సీకి విజ్ఞప్తి చేశారు.