fbpx
Thursday, December 12, 2024
HomeNationalశబరిమలలో వీఐపీ దర్శనం వివాదం: హైకోర్టు సీరియస్

శబరిమలలో వీఐపీ దర్శనం వివాదం: హైకోర్టు సీరియస్

VIP-DARSHAN-CONTROVERSY-IN-SABARIMALA-HIGH-COURT-SERIOUS

కేరళ: శబరిమలలో వీఐపీ దర్శనం వివాదం: హైకోర్టు సీరియస్

శబరిమల అయ్యప్ప ఆలయంలో ప్రముఖ సినీనటుడికి వీఐపీ దర్శనం కల్పించడంపై కేరళ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయ యాజమాన్య వ్యవస్థ అయిన ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ)ను ఈ వ్యవహారంపై హైకోర్టు ప్రశ్నించింది.

గత గురువారం మలయాళ నటుడు దిలీప్ అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా టీడీబీ అతనికి ప్రత్యేక వీఐపీ దర్శనం ఏర్పాటు చేసింది. అయితే ఈ కారణంగా సాధారణ భక్తులు, ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు చాలా సేపు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది.

ఈ ఘటనపై మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా, కేరళ హైకోర్టు సుమోటోగా ఈ వ్యవహారాన్ని స్వీకరించింది. కోర్టు ఈ చర్యలను తీవ్రంగా తప్పుబడుతూ ఆలయ యాజమాన్యాన్ని ప్రశ్నించింది. “ఆ నటుడికి అంతసేపు ఆలయంలో ఉండటానికి ఎలా అనుమతి ఇచ్చారు?” అంటూ కోర్టు నిలదీసింది.

రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులకు మాత్రమే వీఐపీ దర్శనం సౌకర్యం కల్పించాల్సి ఉంటుందని, ఇతరులకు ఈ అవకాశాన్ని ఇవ్వడం నిబంధనలకు వ్యతిరేకమని కోర్టు స్పష్టం చేసింది. టీడీబీ చర్యల వల్ల భక్తులు ఎటువంటి అసౌకర్యాలకు గురికావలసి వచ్చిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని, శనివారానికి ముందుగా వీడియో ఫుటేజీతో పాటు నివేదికను సమర్పించాలని కేరళ పోలీసులకు న్యాయమూర్తులు జస్టిస్ నరేంద్రన్, జస్టిస్ మురళీకృష్ణలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

ఈ వివాదంలో నటుడిని ప్రతివాదిగా చేర్చే విషయాన్ని కోర్టు పరిశీలిస్తామని తెలిపింది. క్రమశిక్షణా ఉల్లంఘనలకు సంబంధించి దేవస్థానం బోర్డు నిర్ణయాలను సమీక్షించాల్సిన అవసరం ఉందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular