మూవీడెస్క్: కలర్ ఫొటో చిత్ర దర్శకుడు సందీప్ రాజ్, అదే చిత్రంలో నటించిన హీరోయిన్ చాందినీ రావు ఇవాళ తిరుమలలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
ఈ వేడుకకు నటుడు సుహాస్ తన కుటుంబంతో హాజరయ్యారు. అలాగే వైవా హర్షతో పాటు పలువురు సినిమా ప్రముఖులు కూడా ఈ వివాహ కార్యక్రమంలో సందడి చేశారు.
సందీప్ రాజ్, చాందినీ రావుల పరిచయం ‘కలర్‌ఫొటో’ మూవీ సమయంలో మొదలైంది.
ఆ పరిచయం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో ఈ రోజున వివాహంలో తారసపడింది.
తిరుమల కొండల నడుమ సాంప్రదాయంగా జరిగిన ఈ వేడుకకు నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తొలి చిత్రమైన ‘కలర్‌ఫొటో’తోనే జాతీయ అవార్డు గెలుచుకున్న సందీప్ రాజ్, ప్రస్తుతం తన రెండో ప్రాజెక్ట్‌పై దృష్టి సారించారు.
ఈ సినిమాకు ‘మోగ్లీ’ అనే టైటిల్ పెట్టగా, రాజీవ్ కనకాల, సుమ దంపతుల కుమారుడు రోషన్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు.
ఈ కొత్త జంటకు సినీ పరిశ్రమతో పాటు అభిమానులు విశేషంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సందీప్, చాందినీ కలిసి సంతోషకర జీవితాన్ని గడపాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.