ఏపీ: బోరుగడ్డ అనిల్ కుమార్ వివాదం ప్రస్తుతం వైసీపీకి పెద్ద చిక్కుగా మారింది. గతంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు, భూ కబ్జాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్న బోరుగడ్డ, తాజాగా గుంటూరులో ఓ పాస్టర్ ఫిర్యాదుతో అరెస్టయ్యారు.
ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా, బోరుగడ్డపై ఇతర కేసుల వివరాలు కూడా వెలుగుచూస్తున్నాయి.
తాజాగా బోరుగడ్డ, వైసీపీ కీలక నేతల ప్రమేయాన్ని తన వాంగ్మూలంలో ప్రస్తావించడం కేసును మరింత ఉద్రిక్తతకు దారి తీసింది.
తాడేపల్లి కేంద్రంగా కొందరు కీలక నాయకుల సూచనలతోనే తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేశానని బోరుగడ్డ ఆరోపించినట్లు సమాచారం. దీనితో వైసీపీకి రాజకీయంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదే సమయంలో బోరుగడ్డ అప్రూవర్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామం వల్ల ఆయన ఇచ్చే సమాచారం, వైసీపీలో మరికొంతమందికి నేరపరమైన చిక్కులు తెచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బోరుగడ్డపై సోషల్ మీడియాలో పలు కేసులు నమోదు కాగా, దీనిపై పార్టీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి మద్దతు అందకపోవడం గమనార్హం.