ఏపీ: జనసేన నాయకుడు నాగబాబు కొత్త అవతారంలో కనిపించనున్నారు. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కేబినెట్‌లో మంత్రిగా నాగబాబు ఎంపిక కావడం సంచలనంగా మారింది.
ఎప్పుడూ తన ప్రసంగాలు, సామాజిక అభిప్రాయాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగబాబు, ఇప్పుడు రాజకీయ వేదికపై కీలక పాత్ర పోషించనున్నారు.
నాగబాబు ప్రత్యేకత ఆయన మాటల శైలిలో ఉంది. వివాదాలపై కూడా లౌక్యం తో కూడిన వ్యాఖ్యలు చేయడంలో ఆయనకు ప్రత్యేకత ఉంది.
చిరంజీవి, గరికపాటి మధ్య చిన్న వివాదం జరిగే సమయంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీసిన ఉదాహరణే తీసుకుంటే సరిపోతుంది.
నాగబాబు మాటలు ఆలోచింపజేసేలా ఉంటాయి. నేరుగా ఎదుటివారిని దూషించకుండా, వ్యంగ్యాన్ని కలిపిన వ్యాఖ్యలతో ఆయన చర్చనీయాంశంగా మారతారు.
నాగబాబు తన పార్టీలో కూడా అసంతృప్తి నేతలను తాను కోరుకున్న రీతిలో లైన్‌లో పెట్టగలిగిన ఘనత ఉంది. పిఠాపురం వివాదం సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సమస్యను శాంతంగా పరిష్కరించడంలో కీలకమయ్యాయి.
ఇప్పుడు చంద్రబాబు కేబినెట్‌లో ఆయన చేరుతుండటంతో, ప్రభుత్వానికి సంబంధించి ఆయన కొత్త పంథాను తీసుకురావడం ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.