హైదరాబాద్: సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఆరోగ్యం సంబంధిత తాజా సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన కుటుంబ కలహాల మధ్య మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది.
ఇక మోహన్ బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో నిన్న చేరారు. ఆయనకు ఎడమకంటికి గాయాలు ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.
అధిక రక్తపోటు, హృదయ స్పందనలో హెచ్చుతగ్గులు ఉన్నట్లు వైద్యులు వివరించారు. ఆయన ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
ఒళ్లు నొప్పులు, ఆందోళన కారణంగా ఆసుపత్రిలో చేరిన మోహన్ బాబుకు రెండు రోజులు ఆసుపత్రిలోనే విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.
ఇక, మోహన్ బాబు ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు పూర్తి స్థాయి కోలుకునే నమ్మకంతో ఉన్నారు.