పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాను ఏర్పాటుచేసిన ఇండియా కూటమి నాయకత్వాన్ని స్వీకరించేందుకు సిద్ధమని చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
దేశ అభివృద్ధి కోసం కూటమిని సమర్థవంతంగా నడిపించేందుకు తాను సిద్ధమని, ఇదే విషయాన్ని కూటమి నేతలు విశ్వసించడం గర్వకారణమని మమతా తెలిపారు.
ఇటీవలి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల పరాజయాల తర్వాత, రాహుల్ గాంధీ నాయకత్వంపై ఉన్న అనుమానాల కారణంగా కొందరు ఇండియా కూటమి భాగస్వాములు మమతా వైపు మొగ్గు చూపుతున్నారు.
మమతా నాయకత్వంలో కూటమి బలపడుతుందనే అభిప్రాయాన్ని సమాజ్‌వాది, ఆర్జేడీ, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) పార్టీల నేతలు వ్యక్తపరిచారు.
ఆమె బీజేపీ వ్యతిరేక పోరాటంలో కీలకమైన వ్యక్తిగా ఉన్నారని ఆర్జేడీ నేత మృత్యుంజయ్ తివారి ప్రశంసించారు.
ఈ పరిణామాలు ప్రతిపక్ష కూటమిలో నాయకత్వంపై పెద్ద చర్చకు దారితీసాయి. మమతా బెనర్జీ నాయకత్వాన్ని అన్ని పార్టీల నేతలు ఆమోదిస్తారా లేదా అన్నది కీలక అంశంగా మారింది.