ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు సామాజిక సంక్షేమ రంగంలో మరో ముందడుగు వేశారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులకు అందిస్తున్న పెన్షన్ పథకంలో కీలక మార్పులు చేస్తూ, తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా పెన్షన్ అందించాలని నిర్ణయించారు.
ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా నూతన ప్రోత్సాహకంగా నిలుస్తుంది. కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ, అనర్హులైన పెన్షన్ లబ్ధిదారులను గుర్తించేందుకు 3 నెలల గడువు ఇచ్చారు.
అనంతరం కూడా పథకాన్ని అక్రమంగా ఉపయోగించుకుంటున్న వారిని గుర్తించకపోతే, కలెక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 6 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయని సమాచారం. తల్లిదండ్రులు లేని పిల్లలకు పెన్షన్ అందించడం ఏపీ ప్రభుత్వం సృష్టించిన సరికొత్త సాంఘిక సంక్షేమ పథకంగా నిలుస్తోంది.
ఇది పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించడంలో కీలకంగా మారనుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇప్పటివరకు ఇలాంటి పథకం అమలులో లేదు. ఈ విధానం ఏపీని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలపనుంది.