ఆంధ్రప్రదేశ్: కూటమి ప్రభుత్వం మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో షాక్ ఇచ్చింది. మాచవరంలో ఉన్న సరస్వతి పవర్ అసైన్డ్ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ భూములు అక్రమంగా కేటాయించబడ్డాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
మాచవరంలో ఉన్న 17.69 ఎకరాల భూములు అసైన్డ్ కేటాయింపులకు అనుగుణంగా లేవని అధికారుల నివేదికలో వెల్లడైంది.
సర్వేలు, రికార్డుల పరిశీలన అనంతరం భూములను ప్రభుత్వ కస్టడీలోకి తీసుకోవాలని అధికారులు సూచించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఈ విచారణ చేపట్టారు.
ఈ పరిణామాలు వైఎస్ కుటుంబానికి రాజకీయంగా ప్రతికూల ప్రభావాన్ని కలిగించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పటికే కోర్టులో ఉన్న ఆస్తుల వివాదాల నేపథ్యంలో, ఈ నిర్ణయం జగన్ కుటుంబంపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని అంటున్నారు.