మూవీడెస్క్: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఇండియన్ సినిమా రికార్డులను సృష్టిస్తూనే, సుకుమార్ క్రేజ్‌ను మరింత పెంచింది.
1000 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
యూఎస్ మార్కెట్‌లో 10 మిలియన్ డాలర్లను దాటిన ఈ చిత్రం, నార్త్ ఇండియాలో 350+ కోట్ల వసూళ్లు రాబట్టింది.
లాంగ్ రన్‌లో 1500 కోట్ల గ్రాస్ సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ అనలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు.
పుష్ప సిరీస్ విజయంతో సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారిపోయారు. పుష్ప 2 హైప్ మధ్య సుక్కు నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరుగుతోంది.
రామ్ చరణ్‌తో చేయబోయే RC 17 గురించి చాలా ఊహాగానాలు ఉన్నాయి.
అయితే, అది కాకుండా, సుకుమార్ ముందుగా OTT నెట్‌ఫ్లిక్స్ కోసం ఒక డాక్యుమెంటరీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం.
ఈ డాక్యుమెంటరీ కూడా పుష్పలో చూపిన గంధపు చెట్ల నేపథ్యాన్ని మరింత వివరిస్తుందట.
సుకుమార్ గంధపు చెట్లపై డీప్ రీసెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. గంధపు చెట్ల ఎగుమతి, అక్రమ రవాణా, వాటి విస్తరణ తదితర విషయాలను ఇందులో చూపించనున్నారు.
నెట్‌ఫ్లిక్స్ ఇటీవల ఆసక్తికరమైన డాక్యుమెంటరీలకు ప్లాట్‌ఫామ్‌గా మారుతోంది. ఈ ప్రాజెక్ట్ కూడా ఆ స్థాయిలో ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.
పుష్ప 2 కోసం సేకరించిన డేటాతో ఈ డాక్యుమెంటరీ రూపొందించనున్నారు.
ఈ ప్రాజెక్ట్ పూర్తైన తర్వాత సుకుమార్ RC 17 కోసం స్క్రిప్ట్ వర్క్ మొదలుపెడతారట. .