మూవీడెస్క్: సంధ్య థియేటర్ ఘటన కేసులో ఈరోజు అతి వేగంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు ఉదయం అరెస్ట్ చేయగా, నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
అయితే, మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘంగా జరిగిన విచారణ అనంతరం అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరైంది.
అయితే ఈ అరెస్ట్‌పై పుష్ప-2 హీరోయిన్ రష్మిక మందన్న స్పందిస్తూ తన ఆవేదన వ్యక్తం చేశారు. “ఇది నిజమేనా? నమ్మలేకపోతున్నా.
ఈ ఘటనలో అల్లు అర్జున్ ను ఒక్కరినే బాధ్యులుగా చేయడం చాలా దురదృష్టకరం,” అంటూ ట్వీట్ చేశారు.
ఈ సంఘటన చాలా విషాదకరమైనదని, అసలైన కారణాలను తెలుసుకొని న్యాయంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇక సంఘటన జరిగిన తర్వాత సినీ పరిశ్రమ మొత్తం ఈ కేసుపై స్పందిస్తోంది. పలువురు నటులు, దర్శకులు కూడా అల్లు అర్జున్ కు మద్దతుగా నిలుస్తున్నారు.
“ఒక వ్యక్తిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఇలా వ్యవహరించడం తగదని,” కొందరు అన్నారు.
అల్లు అర్జున్ తనను తప్పుగా లక్ష్యంగా చేసుకున్నారని కోర్టులో పేర్కొన్నట్లు సమాచారం.