మూవీడెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తన కొత్త చిత్రం రాబిన్ హుడ్ (ROBIN HOOD) తో సంక్రాంతి బరిలో నిలవడానికి సిద్ధమవుతున్నాడు.
గతంలో నితిన్-వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వచ్చిన ‘భీష్మ’ భారీ హిట్ అవడంతో, ఈ కాంబోపై మంచి అంచనాలు ఉన్నాయి.
శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండటంతో, ఈ చిత్రంపై యూత్‌లో మరింత క్రేజ్ ఏర్పడింది.
అలాగే, క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తామంటూ మేకర్స్ ప్రకటించినా, పుష్ప-2 ప్రభావం కారణంగా విడుదల వాయిదా పడింది.
మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తూ, ‘రాబిన్ హుడ్’ను జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం.
కానీ సంక్రాంతికి ఇప్పటికే రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్,’ బాలయ్య ‘డాకు మహారాజ్,’ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి భారీ చిత్రాలు విడుదల కానున్నాయి.
ఈ క్రమంలో ‘రాబిన్ హుడ్’ కూడా బరిలో దిగుతుండటంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారుతోంది.
మైత్రీ సంస్థ తమ కంటెంట్ పట్ల పూర్తి నమ్మకంతో ఉంది. పుష్ప-2 ఎగ్జిబిటర్స్ సపోర్ట్‌తో థియేటర్ సమస్యలే ఉండవని భావిస్తున్నారు.
మొత్తానికి నితిన్, మైత్రీ కలిసి సంక్రాంతికి గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది.