ఢిల్లీ: రాజ్యసభలో కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ పై సంచలన ఆరోపణలు చేస్తూ, ఆయన వ్యాఖ్యలు రాజ్యాంగానికి వ్యతిరేకమని నిప్పులు చెరిగారు.
మైనారిటీలకు సంబంధించిన అనుచిత వ్యాఖ్యలతో పాటు, భారతదేశ భవిష్యత్తుపై అనవసర భయాలను పెంచేలా న్యాయమూర్తి మాట్లాడారని ఆమె ఆరోపించారు.
ఈ వ్యాఖ్యల ఆధారంగా జస్టిస్ శేఖర్ యాదవ్‌ను పదవీచ్యుతుడిని చేయాలని రేణుకా చౌదరి డిమాండ్ చేశారు. దీనిపై చర్చకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్‌కు నోటీసు ఇచ్చారు.
అయితే, చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఈ నోటీసును తిరస్కరించి, రేణుకా చౌదరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “రూల్స్ తెలియకుండా మాట్లాడటం మూర్ఖత్వమే” అంటూ ఆమె వ్యాఖ్యలను ఖండించారు.
ఈ పరిణామాలు రాజ్యసభలో ఉద్రిక్తతలకు దారితీశాయి. 55 మంది కాంగ్రెస్ సభ్యులు, ఇతర పార్టీ సభ్యులు చైర్మన్ ధన్‌ఖడ్‌ను, న్యాయమూర్తిని అభిశంసించాలంటూ పట్టుబడుతున్నారు.