మూవీడెస్క్: ‘తొలిప్రేమ’తో కెరీర్ ప్రారంభించిన వెంకీ అట్లూరి, ఆ తరువాత చేసిన ‘మిస్టర్ మజ్ను’ , ‘రంగ్ దే’ సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి.
వరుసగా ప్రేమకథలతో వచ్చిన వెంకీ, ఈ జానర్‌కు పరిమితం అవుతున్నాడనే విమర్శలను ఎదుర్కొన్నాడు.
కానీ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో చేసిన ‘సార్’ సినిమా వెంకీకి భారీ బ్రేక్ అందించింది. కార్పొరేట్ ఎడ్యుకేషన్ నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా రెండు భాషల్లోనూ ఘనవిజయం సాధించింది.
తాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కించిన ‘లక్కీ భాస్కర్’తో వెంకీ మరొక హిట్ అందుకున్నాడు.
బ్యాంకింగ్ మోసాలపై సునిశితంగా కథను చెప్పిన ఆయన, ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. కానీ తెలుగులో సినిమాలు చేయకపోవడం పై విమర్శలు వెంకీని వెంటాడుతూనే ఉన్నాయి.
‘సార్’, ‘లక్కీ భాస్కర్’ కథలను మొదట తెలుగు హీరోలు రిజెక్ట్ చేయడంతో కోలీవుడ్ హీరోలతో చేశాడన్న టాక్ వినిపిస్తోంది.
ఇప్పుడు మరోసారి కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో సినిమా చేయడానికి వెంకీ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించబోతోందని టాక్. ఇటీవల ‘కంగువా’ డిజాస్టర్ తర్వాత సూర్య కెరీర్‌ను పట్టాలెక్కించడానికి ఈ సినిమా కీలకం కానుంది.
కథ సైతం ప్రస్తుత మార్కెట్‌కు తగ్గట్లుగా సిద్ధమైందని తెలుస్తోంది. వెంకీ, సూర్య కాంబినేషన్ సినిమాకు మరింత క్లారిటీ రాబోయే రోజుల్లో వచ్చే అవకాశం ఉంది.
ఒకవేళ ఇది ఫైనల్ అయితే, వచ్చే ఏడాది చివర్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని అంచనా. మరి ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి!