అంతర్జాతీయం: గూగుల్ టైమ్‌లైన్ డాటా మార్పులు
గూగుల్ తన మ్యాప్స్ లొకేషన్ హిస్టరీ ఫీచర్‌లో ప్రధాన మార్పులు తీసుకొస్తోంది. ఈ డేటాను స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే స్టోర్ చేసి, క్లౌడ్ డేటాను తొలగించనుంది. దీనికి సంబంధించి డిసెంబర్ 1, 2024, చివరి తేదీగా ప్రకటించిన గూగుల్, గడువును జూన్ 9, 2025 వరకు పొడిగించింది.
టైమ్‌లైన్ అంటే ఏమిటి?
గూగుల్ మ్యాప్స్‌లో టైమ్‌లైన్ అనేది యూజర్ పర్సనల్ మ్యాప్‌లాంటి ఫీచర్. గతంలో సందర్శించిన ప్రాంతాలు, ట్రిప్‌ల వివరాలు గుర్తుచేసుకోవడానికి ఉపయోగపడుతుంది. టైమ్‌లైన్ డేటా మనకు మాత్రమే కనిపించేలాగా సెట్ చేసుకోవచ్చు. దీన్ని ఎడిట్ చేయడం లేదా డిలీట్ చేయడం కూడా యూజర్లకు సులభం.
మార్పుల కారణం ఏమిటి?
గూగుల్ క్లౌడ్‌లో ఉన్న మొత్తం లొకేషన్ డేటాను తొలగించి, వ్యక్తిగత డివైజ్‌లలో సేవ్ చేయనుంది. ఇదివరకు యూజర్ డేటా క్లౌడ్‌లో స్టోర్ చేస్తుండగా, ఇప్పుడు అది మూడు నెలలపాటు మాత్రమే స్టోర్ అవుతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది.
డేటా డిలీట్ కాకుండా ఎలా సేవ్ చేసుకోవాలి?
- సెట్టింగ్స్ అప్‌డేట్ చేయండి:
గూగుల్ మ్యాప్ వర్షన్ 11.106 లేదా ఆండ్రాయిడ్ 6.0 ఉపయోగించండి. - ‘ఎక్స్‌ప్లోర్ టైమ్‌లైన్’ ఓపెన్ చేయండి:
కావలసిన డేటా ఎంచుకుని గూగుల్ సర్వర్‌కు పంపండి. - బ్యాకప్ డేటా ఇంపోర్ట్ చేయండి:
కొత్త డివైజ్‌లోకి స్విచ్ అయితే, పాత డివైజ్ నుంచి ఆటోమేటిక్ బ్యాకప్ పొందండి. - ఎక్స్‌ట్రా టిప్స్:
- పాత ట్రిప్‌ల సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- ఇంపోర్ట్ బ్యాకప్ ఆప్షన్ ద్వారా కొత్త ఫోన్లో డేటా పొందవచ్చు.
గడువు ముగింపు తేదీ:
జూన్ 9, 2025 వరకు యూజర్లు తమ టైమ్‌లైన్ డేటాను సేవ్ చేసుకోవాలి. దీని తర్వాత ఈ డేటా శాశ్వతంగా డిలీట్ అవుతుంది.