మూవీడెస్క్: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మరోసారి కొత్త అవతారంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సంబరాల యేటిగట్టు SYG అనే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో తేజ్ కనిపించే లుక్ అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.
తాజాగా విడుదలైన కార్నేజ్ వీడియోలో సిక్స్ ప్యాక్ బాడీతో, విపరీతమైన యాక్షన్ సీక్వెన్స్‌లతో తేజ్ తెరపై దుమ్ము రేపారు.
ఇదిలా ఉండగా, ఈ లుక్‌కి అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రత్యేకమైన డైట్, కఠినమైన వర్కౌట్ ద్వారా తేజ్ తన ఫిజిక్‌ను పూర్తిగా మార్చుకుని, తెరపై అద్భుతంగా మెరిశారు.
గతంలో ఎదురైన అనారోగ్య సమస్యల్ని అధిగమించి ఇంత గట్టిగా రీ ఎంట్రీ ఇవ్వడం ఆయన డెడికేషన్‌కి నిదర్శనం.
అయితే, ఈ లుక్ చూస్తే సంబరాల యేటిగట్టు తేజ్ కెరీర్‌లో మరో కీలక సినిమా అవుతుందనే నమ్మకాన్ని అభిమానుల్లో పెంచింది.
దర్శకుడు రోహిత్ కేపీ విజన్ వీడియో ద్వారా స్పష్టంగా కనిపించింది.
కాగా, అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్, గ్రాండ్ విజువల్స్‌తో ఈ సినిమా పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకోబోతుందని టాక్.
మేకర్స్ ఈ సినిమాను 2025 సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నారు.
ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు.
సాయి తేజ్ కొత్త లుక్, అద్భుతమైన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి.
మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి.