ఆళ్లగడ్డ: ప్రముఖ నటుడు మంచు మనోజ్ పొలిటికల్ ఎంట్రీపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు హల్‌చల్ చేస్తున్నాయి. జనసేన పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, తాజాగా మంచు మనోజ్ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు.
ఆళ్లగడ్డకు వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లోకి వస్తున్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని తాను ఖండిస్తున్నానని స్పష్టంచేశారు. “ప్రస్తుతం రాజకీయాల గురించి ఏమీ మాట్లాడలేను,” అని మంచు మనోజ్ పేర్కొన్నారు.
తన అత్తగారి జయంతి సందర్భంగా మొదటిసారిగా తన కుమార్తె దేవసేన శోభను ఆళ్లగడ్డకు తీసుకువచ్చానని ఆయన తెలిపారు.
కుటుంబంతో పాటు స్నేహితులు కలిసి జయంతి రోజును ప్రత్యేకంగా జరుపుకున్నామని, గ్రామ ప్రజలు తమను ఎంతో ప్రేమగా ఆదరించారని ధన్యవాదాలు తెలిపారు.
మంచు మనోజ్ రాజకీయ ప్రవేశంపై ఇప్పటికైతే స్పష్టత ఇవ్వలేదు కానీ, ఈ క్లారిటీతో ప్రచారానికి తాత్కాలికంగా తెరపడినట్టయింది.