అమెరికా: డొనాల్డ్ ట్రంప్‌కు న్యూయార్క్ కోర్టు మరోసారి భారీ ఎదురుదెబ్బ ఇచ్చింది. హష్ మనీ కేసు నుంచి రక్షణ కోరుతూ ట్రంప్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
అధ్యక్షుడికి అధికారిక పనులకు సంబంధించిన కేసుల్లో మాత్రమే రక్షణ వర్తిస్తుందని, వ్యక్తిగత కేసుల్లో ఇది వర్తించదని జడ్జి జువాన్ మర్చన్ స్పష్టంచేశారు.
హష్ మనీ కేసులో ట్రంప్‌ను మన్ హట్టన్ కోర్టు గతంలో దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సమయంలో పోర్న్ స్టార్ స్టార్మీ డానియల్స్‌కు నోరు మూయడానికి 1.30 లక్షల డాలర్లు చెల్లించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
విరాళాల సొమ్మును దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలతో పాటు మొత్తం 34 నేరారోపణలు నమోదయ్యాయి.
ఇదే తరుణంలో ట్రంప్ అధ్యక్ష పదవికి ఎన్నికైనప్పటికీ, శిక్ష వాయిదా పడింది. అయితే, కోర్టు తిరస్కరించిన తాజా పిటిషన్‌తో ఆయనకు రక్షణ దొరకలేదు.
కేసు కొనసాగినట్లయితే ట్రంప్, శిక్షను ఎదుర్కొంటూ వైట్ హౌస్‌లో అడుగుపెట్టే తొలి అధ్యక్షుడిగా చరిత్రలో నిలవనున్నారు.