మూవీడెస్క్: టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ తన నూతన చిత్రం బచ్చల మల్లి తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
డిసెంబర్ 20న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ట్రైలర్, టీజర్, పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బచ్చల మల్లి మూవీపై ప్రేక్షకుల్లో హైప్ పెరిగిపోయింది.
నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గెస్ట్‌గా పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ “అల్లరి నరేష్ గొప్ప నటనతో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
22 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో వేరియేషన్స్ చూపించిన నరేష్ అన్నకు స్టార్ ట్యాగ్ ఇవ్వాల్సిన సమయం ఇది” అని అభిప్రాయపడ్డారు.
అంతేకాకుండా, నిర్మాత రాజేష్ దండాపై ప్రశంసలు కురిపిస్తూ “ఇతని వంటి ప్యాషనేట్ నిర్మాతల వల్లే మంచి చిత్రాలు వస్తాయి.
బచ్చల మల్లి మంచి హిట్ అవుతుంది” అన్నారు. తన మొదటి హీరోగా అల్లరి నరేష్‌ను కలిసిన అనుభవాన్ని పంచుకున్న కిరణ్, ఆయనకు త్వరలో స్టార్ హోదా రావాలని ఆకాంక్షించారు.
బచ్చల మల్లి అల్లరి నరేష్ కెరీర్‌లో మరో కీలక చిత్రం అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో, ఎమోషనల్ డ్రామాతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకం.
మరి ఈ సినిమా నరేష్ కెరీర్‌ను మరో మలుపు తిప్పుతుందా అనేది వేచి చూడాలి.