మూవీడెస్క్: నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెరంగేట్రంపై ఇప్పటి వరకు పలు వార్తలు వినిపించాయి.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ మొదలవుతుందని అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటికీ, సినిమా షూటింగ్ వాయిదా పడటం చర్చనీయాంశమైంది.
హెల్త్ ఇష్యూస్ కారణంగా ప్రాజెక్ట్ ఆలస్యం అయిందని బాలకృష్ణ చెప్పినా, క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల ప్రాజెక్ట్ నిలిచిపోయిందనే టాక్ బలపడుతోంది.
ఇదిలా ఉంటే, మోక్షజ్ఞ డెబ్యూ కోసం మరో ఇద్దరు ప్రముఖ దర్శకులను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
నాగ్ అశ్విన్, వెంకీ అట్లూరి ఈ లిస్ట్‌లో ఉన్నట్లు సమాచారం. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై మోక్షజ్ఞ మొదటి సినిమా ఉంటే బాగుంటుందని నందమూరి ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
కానీ, ఆయన ప్రస్తుతం ‘కల్కి 2898ఏడీ పార్ట్ 2’తో బిజీగా ఉన్నందున ఇది త్వరలో జరగబోదని భావిస్తున్నారు.
మరోవైపు, సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌లో వెంకీ అట్లూరి చెప్పిన కథను బాలయ్య ఓకే చేస్తే, మోక్షజ్ఞ ప్రాజెక్ట్ వెంటనే పట్టాలెక్కే అవకాశముంది.
ఇదే సమయంలో, బాలకృష్ణ ‘ఆదిత్య 369’ సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’తో తనయుడిని పరిచయం చేయాలని చూస్తున్నారు. కానీ, ఈ ప్రాజెక్ట్‌కి కూడా ఇంకా స్పష్టత రాలేదు.
ప్రస్తుతం బాలయ్య ఎంచుకునే నిర్ణయమే కీలకం. మోక్షజ్ఞ ఎంట్రీపై ఎప్పుడూ క్లారిటీ వస్తుందోనని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఒకవేళ మరింత ఆలస్యం అయితే, మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం ప్రేక్షకులు ఇంకా వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది.