ఎగవేతదారుల ఆస్తుల నుంచి రూ.22 వేల కోట్లు రికవరీ
ఢిల్లీ: బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థుల నుంచి రూ.22,280 కోట్లను రాబట్టామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
ఈ సొమ్ము ముంబైలోని స్పెషల్ కోర్టు అనుమతితో వేలం ద్వారా బ్యాంకులకు జమ చేసినట్లు తెలిపారు.
విజయ్ మాల్యా ఆస్తుల నుంచి రూ.14 వేల కోట్లు, నీరవ్ మోదీ ఆస్తుల నుంచి వెయ్యి కోట్లు రికవరీ చేశారు.
అదేవిధంగా, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి చెందిన రూ.2,566 కోట్ల ఆస్తులను వేలం వేయడానికి అనుమతులు పొందినట్లు మంత్రి వివరించారు.
పీఎంఎల్ఏ చట్టం కింద ఈడీ ఆధ్వర్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. చోక్సీ, మోదీ వంటి వ్యక్తులు పంజాబ్ నేషనల్ బ్యాంకు సహా అనేక బ్యాంకులను మోసగించారని, వారి ఆస్తుల విక్రయం ద్వారా నష్టపోయిన బ్యాంకులకు నిధులు అందించినట్లు తెలిపారు.
ఈ చర్యలు ఆర్థిక నేరస్థులపై కేంద్రం దృష్టిని స్పష్టంగా చూపిస్తున్నాయని ఆర్థిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.