టాలీవుడ్ బాక్సాఫీస్ అంటే నేషనల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్ అప్పా!
మూవీడెస్క్: 2024 టాలీవుడ్ బాక్సాఫీస్ ను ఓ రేంజ్‌లో షేక్ చేసిన సంవత్సరం అని చెప్పొచ్చు.
పాన్ ఇండియా సినిమాలు రెండు 1000 కోట్ల క్లబ్‌లో చేరడం, మరెన్నో చిత్రాలు భారీ వసూళ్లను సాధించడం ఈ ఏడాది టాలీవుడ్ రేంజ్‌ను చాటిచెప్పాయి.
మాస్, క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా స్టార్లు కథల ఎంపికతో పాటు నటనలోనూ మెరుపులు చూపించారు.
అల్లు అర్జున్ “పుష్ప 2“తో వసూళ్ల పరంగా టాప్ స్థానంలో నిలిచాడు. 13 రోజుల్లోనే ఈ సినిమా రూ. 1375 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుని, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది.
సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ అల్లు అర్జున్ నటనతో మెస్మరైజ్ చేసింది.
ఇక ప్రభాస్ “కల్కి 2898 ఏడీ”తో 1000 కోట్ల క్లబ్‌లో మరోసారి అడుగుపెట్టాడు.
ఈ సినిమాతో ప్రభాస్ టాలీవుడ్‌లో అత్యధిక మార్కెట్ కలిగిన హీరోగా తన స్థానాన్ని నిలబెట్టాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ “దేవర పార్ట్ 1″తో 420 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి మూడో స్థానంలో నిలిచాడు.
ఎన్టీఆర్ వన్ మెన్ షోగా ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ సినిమా లాంగ్ రన్‌లో మంచి వసూళ్లు సాధించింది.
తేజా సజ్జా “హనుమాన్”తో 296 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, తన మార్కెట్ కు సరికొత్త రేంజ్ తెచ్చుకున్నాడు.
మహేష్ బాబు “గుంటూరు కారం”తో 175 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి టాప్ 5లో నిలిచాడు. సిద్దు జొన్నలగడ్డ “టిల్లు స్క్వేర్”తో 125 కోట్ల గ్రాస్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
దుల్కర్ సల్మాన్ “లక్కీ భాస్కర్”తో 111.3 కోట్లు వసూలు చేయగా, నాని “సరిపోదా శనివారం”తో 100 కోట్ల క్లబ్‌లో చేరాడు.
2024లో ఈ స్టార్లు తమ ప్రతిభతో టాలీవుడ్ స్టామినాను మరింత పెంచారు.