గుంటూరు: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో మళ్లీ వార్తల్లోకి వచ్చారు. గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ వద్ద చేసిన ధర్నా, రభస, అధికారులపై వాగ్వాదం ఆయనకు చిక్కులు తెచ్చింది.
పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై అంబటి రాంబాబు, ఆయన అనుచరులపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.
టీడీపీ, జనసేన సోషల్ మీడియా పోస్టులపై తాము చేసిన ఫిర్యాదుల గురించి ఎలాంటి చర్యలు తీసుకోలేదని అంబటి పట్టుబట్టారు.
తన ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ వద్ద ప్లకార్డులతో ధర్నా నిర్వహించారు.
పోలీసుల వివరణకు ఒప్పుకోకుండా అనుచరులతో కలిసి స్టేషన్‌లో ఆందోళనకు దిగారు. విధులకు ఆటంకం కలిగించారనే కారణంతో అంబటి, అనుచరులపై కేసు నమోదైంది.
ప్రస్తుతం అంబటి ధర్నా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ప్రతిపక్షం లేకున్నా, తన దూకుడును కొనసాగిస్తానని అంబటి మరోసారి ప్రదర్శించారు.