ముంబై: డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి చేరింది.
ఈ క్షీణత అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో పాటు దేశీయ పెట్టుబడులలో మాంద్యం కారణంగా ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు.
డాలర్ బలపడటం, భారత మార్కెట్‌లో పెట్టుబడుల తగ్గుదల ఈ మారకం విలువపై ప్రధాన ప్రభావాన్ని చూపింది.
గత కొన్నేళ్లుగా రూపాయి విలువ క్రమంగా పడిపోతుండగా, ఇప్పుడు అది మరింత వేగంగా క్షీణించింది. ప్రపంచవ్యాప్తంగా ఇతర ఆసియా కరెన్సీలు కూడా ఈ ప్రభావానికి లోనయ్యాయి.
కొరియన్ వొన్, మలేసియా రిగ్గిట్, ఇండోనేషియా రుపయా కూడా 0.8-1.2 శాతం వరకు క్షీణించాయి. ఈ పరిస్థితి దిగుమతుల వ్యయాన్ని పెంచుతుందని, ద్రవ్యోల్బణంపై మరింత ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, రూపాయి స్థిరత్వాన్ని పునరుద్ధరించేందుకు ఆర్బీఐ నుంచి తక్షణ చర్యల అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.