మూవీడెస్క్: తెలుగు సినీ ఇండస్ట్రీకి ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది.
బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాలు ఓ రేంజ్ లో కలెక్షన్స్ కొల్లగొడుతున్నాయి.
ముఖ్యంగా స్టార్ట్ నుంచి హైప్ సృష్టించిన చిత్రాలు విడుదలకు ముందు నుంచే భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ సాధించడం విశేషం. తాజాగా విడుదలైన పుష్ప 2 కూడా అదే బాటలో ఉంది.
ఇప్పటికే పుష్ప 2 తెలుగు రాష్ట్రాల్లో 199 కోట్ల షేర్‌ను అందుకుని, మూడో స్థానంలో నిలిచింది.
షేర్ లెక్కలతో టాప్‌లో మాత్రం ఎప్పటిలాగే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ఉంది.
ఈ చిత్రం 272.31 కోట్ల షేర్‌తో అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాతి స్థానంలో ఉన్న బాహుబలి 2 204 కోట్ల షేర్‌ను రాబట్టింది.
పుష్ప 2 ఇంకా పరుగులు తీస్తుండటంతో ఇది రెండో స్థానంలో చేరే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇక నాలుగో స్థానంలో కల్కి 2898ఏడీ 187.27 కోట్ల షేర్‌తో నిలిచింది. ఐదో స్థానంలో దేవర పార్ట్ 1 162.80 కోట్లను అందుకుంది.
రాబోయే గేమ్ చేంజర్, హరిహర వీరమల్లు, ఓజీ వంటి పాన్ ఇండియా చిత్రాలు ఈ రికార్డులను బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.
ఇప్పటి వరకు తెలుగులో అత్యధిక షేర్ వసూలు చేసిన సినిమాల లిస్ట్ చూస్తే, టాలీవుడ్ ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులర్ అయిందో స్పష్టమవుతోంది.