మూవీడెస్క్: టాలీవుడ్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లోనే ప్రత్యేకమైన స్థాయికి చేరుతుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే యూఎస్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ఈ చిత్రానికి సంబంధించిన ఫైనల్ కట్స్ పూర్తవడంతో 2 గంటల 45 నిమిషాల నిడివితో సినిమా థియేటర్స్‌కు రెడీ అయినట్లు సమాచారం.
‘గేమ్ చేంజర్’లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తూ తండ్రికొడుకులుగా రెండు విభిన్న టైమ్‌లైన్స్‌లో కనిపించబోతున్నాడు.
ఒక పాత్ర స్టూడెంట్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్‌గా ఎదిగిన వ్యక్తిగా ఉంటే, మరో పాత్ర పొలిటికల్ లీడర్‌గా ప్రత్యేకంగా ఆకట్టుకోనుంది.
ఫస్ట్ హాఫ్ కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సన్నివేశాలతో చరణ్ పాత్రలోని జాతరను చూపించనున్నారు.
ఇంటర్వెల్ బ్యాంగ్‌లో చరణ్ ఐఏఎస్‌గా మారిన ట్రాన్స్‌ఫర్మేషన్ ఈ సినిమా హైలైట్‌గా మారనుంది.
సెకండ్ హాఫ్‌లో చరణ్ పాత్ర చుట్టూ కీలకమైన పొలిటికల్ ట్విస్టులు, ఎమోషనల్ డ్రామా సాగే సీన్స్ ఉంటాయని టాక్.
అలాగే క్లైమాక్స్‌లో శంకర్ మార్క్ యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనున్నాయి.
‘ఒకే ఒక్కడు’, ‘జెంటిల్మన్’ తరహాలో ఈ సినిమా కథ కూడా సామాజిక అంశాలపై దృష్టి సారించిందని తెలుస్తోంది.
ఈ చిత్రంలో ఎస్ జె సూర్య ప్రతినాయకుడిగా, శ్రీకాంత్ పొలిటికల్ లీడర్‌గా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా, సునీల్ పాత్ర మరో కీలక ఎలిమెంట్‌గా నిలవనుంది.
మొత్తానికి శంకర్ మార్క్‌తో రూపొందిన ‘గేమ్ చేంజర్’ సంక్రాంతి బరిలో కొత్త చరిత్ర సృష్టించే అవకాశాలున్నాయి.